
నరేందర్‌పవార్
వరంగల్ రూరల్, కొడకండ్ల(పాలకుర్తి): మలేషియాలో ఈనెల 19 నుంచి 22 వరకు జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపెల్లి శివారు లాలుతండాకు చెందిన యువ పరిశోధక విద్యార్థి వాంకుడోత్ నరేందర్‌పవార్‌కు ఆహ్వానం లభించింది. క్యేన్సర్ వ్యాధి, జటిలమైన సోయాసిస్ చర్మ వ్యాధులకు జన్యు స్థాయిలో ఔషధ మొక్కలపై ఆయన చేసిన పరిశోధనలు, ప్రచురించిన పరిశోధక పత్రాలతో పాటు పరిశోధనలో చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన ఇన్నోవేటివ్ సింటిఫిక్ రీసెర్చ్ ఫ్రొఫెషనల్ మలేషియా సంస్థ వారు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించారు. కాగా, నరేందర్ పవార్ అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడంపై తండావాసులు అభినందించారు.