పేదలను ఆదుకోవాలి

TPCC President Uttam Kumar Reddy Comments On CM KCR - Sakshi

టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతి, ప్రభుత్వం చేపట్టిన పనులు.. తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలో భాగంగా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు మంచి స్పందన వస్తుందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు.

అనంతరం జరిగిన  మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కరోనా తీవ్రతతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని.. ఇప్పటికే లక్ష కు పైగా కరోనా వైరస్‌ బారినపడి మరణించారని వెల్లడించారు. అమెరికా లాంటి అగ్ర దేశంలో ఒక్క రోజే 1500 పైగా మరణించారని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో ఆ స్థాయిలో కరోనా తీవ్రత లేకపోవడం మన అదృష్టమన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా అంశాన్ని, దాని తీవ్రతను ఫిబ్రవరి 12న హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టారని దాని ఫలితంగానే నేడు మన దేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు.

పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్లు పెట్టిన తర్వాత కేంద్రం లాక్ డౌన్ కి వెళ్ళిందని.. తెలంగాణలో  మార్చి 21 న ప్రకటన చేశారు. 22 నుండి లాక్‌ డౌన్‌ అమలులోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 21 రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఇప్పటి వరకు నిరుపేదలు,కూలీలకు ఎలాంటి సాయం అందడం లేదని ఆయన విమర్శించారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న పేదలందరికి రూ.1500 ఇస్తామన్నారని.. కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అందలేదని మండిపడ్డారు. బియ్యం కూడా కేవలం 60 నుంచి 70 శాతం ప్రజలకు మాత్రమే చేరిందన్నారు. ప్రజలకు అందిన సాయంపై సీఎం కేసీఆర్‌కు సమగ్రంగా లేఖ రాస్తామని, సీఎస్‌ను కలిసి  రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఉత్తమ్‌కుమార్‌ కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 23:02 IST
బెంగళూరు: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజు లక్షల్లో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన...
06-05-2021
May 06, 2021, 21:50 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో...
06-05-2021
May 06, 2021, 21:30 IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని ఆరా. కరోనా కట్టడి చర్యలు.. వ్యాక్సినేషన్‌ తదితర అంశాలు తెలుసుకున్న ప్రధాని
06-05-2021
May 06, 2021, 20:01 IST
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఎన్‌440కే వేరియంట్‌పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్‌ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న...
06-05-2021
May 06, 2021, 19:46 IST
న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. రోజు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కోవిడ్ క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ...
06-05-2021
May 06, 2021, 19:09 IST
బాలీవుడ్‌ నటి  శ్రీపద  కరోనాతో కన్ను మూశారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  ట్విటర్‌ ద్వారా  శ్రీపద మరణంపై...
06-05-2021
May 06, 2021, 18:53 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,10,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954  కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 18:34 IST
కరోనా  నివారణకు సంబంధిం సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను  ఆమోదించినట్టు వెల్లడించింది.  స్పుత్నిక్  ఫ్యామిలీకే చెందిన ఈ సింగిల్-డోస్ ‘స్పుత్నిక్ లైట్’ విప్లవాత్మకమైందని, 80 శాతం...
06-05-2021
May 06, 2021, 17:25 IST
ఢిల్లీ: భారత్‌లో క‌రోనా వైర‌స్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా...
06-05-2021
May 06, 2021, 17:14 IST
సాక్షి, అమరావతి : ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50...
06-05-2021
May 06, 2021, 17:12 IST
న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలో ఆక్సిజ‌న్ కొర‌త‌పై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీకి ప్ర‌తిరోజు 700 మెట్రిక్...
06-05-2021
May 06, 2021, 16:30 IST
ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. థర్ఢ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో...
06-05-2021
May 06, 2021, 15:23 IST
సాక్షి, మియాపూర్‌: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 15:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 14:36 IST
జైపూర్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని...
06-05-2021
May 06, 2021, 14:06 IST
యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ   సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు...
06-05-2021
May 06, 2021, 12:30 IST
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో...
06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 09:59 IST
ఒట్టావ: ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ ను 12 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా వేసేందుకు కెనడా ఆరోగ్య...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top