ప్రజలకు అందుబాటులో ఉంటా | tomorrow bandari bhaskar oath at office | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో ఉంటా

Jul 10 2014 1:46 AM | Updated on Sep 2 2017 10:03 AM

ప్రజలకు అందుబాటులో ఉంటా

ప్రజలకు అందుబాటులో ఉంటా

ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు.

జెడ్పీసెంటర్: ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉంటూ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని జిల్లా పరిషత్ చైర్మన్ బండారిభాస్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో తన కు కేటాయించిన అధికార నివాసాన్ని  బు ధవారం ఆయన  పరిశీలించారు. ఈ సం దర్భంగా అవసరమైన మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించా రు. తనను కలిసేందుకు వచ్చే వారికి ఎ లాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, మంచినీటి వసతికి ఇబ్బంది లేకుం డా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 
నేడు బాధ్యతలు స్వీకరణ..?

జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు  అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు బాధ్యలు చేపట్టలేదని సమాచారం. గురువారం జిల్లా పరిషత్‌లో జరిగే మన ఊరు-మన ప్రాణాళిక కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ఎంపీ, ఎమ్మెల్యేలు  హాజరుకానున్న నేపథ్యంలో ఆయన అదేరోజు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నారుు. కాగా ఇప్పటికే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న జెడ్పీ చైర్మన్ ఇప్పటివరకు అధికారింగా బాధ్యతలు స్వీకరించకపోవడం గమనార్హం.
 
అభివృద్ధిలో పాలుపంచుకుందాం
మహబూబ్‌నగర్ రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకోవడంతోనే సరిపోదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటేనే పోరాటం ఫలించినట్లవుతుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్ మండలంలోని జమిస్తాపూర్, కోడూరు, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మొట్టమొదట కోడూరు గ్రామంలో రూ.4.25కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో నిర్మించే బీటీరోడ్డుకు జెడ్పీచైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
 
అనంతరం జరిగిన సమావేశంలో జెడ్పీచైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ..జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వానికి చేయూతనిచ్చే విధంగా అందరు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ముఖ్యభూమిక పోషించారని గుర్తుచేశారు. అన్నిశాఖల ఉద్యోగులు వారివారి స్థాయిలో అభివృద్ధికోసం వంతుగా కృషిచేయాలని కోరారు. ఐదేళ్లప్రణాళికను రూపొందించి..అధికారులు, ప్రజాప్రతిధులు కలిసి పనిచేద్దామన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీదేవి, ఎంపీపీ సావిత్రి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నాగయ్య, బాలమణి, హన్మానాయక్, రామకిష్టమ్మతో పాటు ఎంపీటీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement