చలి తీవ్రతకు తట్టుకోలేక వరంగల్ జిల్లాలో ముగ్గురు వృద్ధులు మృత్యువాత పడ్డారు.
సాక్షి నెట్‌వర్క్: చలి తీవ్రతకు తట్టుకోలేక వరంగల్ జిల్లాలో ముగ్గురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలో చొగొండి పిచ్చయ్య(70) మృతి చెందాడు. తన నివాసంలో ఆదివారం రాత్రి ఇంటి ముందు నిద్రించాడు. చలితీవ్రతతో సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మసాగర్ మండలంలోని మల్లికుదుర్లకు చెందిన కారెంపల్లి జనార్దన్ రెడ్డి (68 ) చలితీవ్రతకు తట్టుకోలేక సోమవారం ప్రాణాలు విడిచాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం గాంధీనగర్ గ్రామ ఆవాసం బాషనాయక్ తండాకు చెందిన బాణోత్ బాషనాయక్(97) చలి తీవ్రతకు అనారోగ్యానికి గురై ఆదివారం రాత్రి మృతి చెందాడు.