ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు | Tenth Exams Cool End | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు

Mar 29 2018 7:04 AM | Updated on Nov 9 2018 5:06 PM

Tenth Exams Cool End - Sakshi

కెరమెరి: బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు

కెరమెరి : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. మండలంలోని కెరమెరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మోడి ఆశ్రమ ఉ న్నత  పాఠశాలల్లో మొత్తం 302 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి అటుపోట్లకు తావు లేకుండా  నిర్వహించారు. 
రెబ్బెన : మండలంలో గత 15వ తేదీన ప్రారంభం అయిన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు గంగాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మండలంలో 418 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర య్యారు.
తిర్యాణి: పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్ష కేంద్రంలో 234 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం పరీక్ష కేంద్రాన్ని స్క్వాడ్‌ జబ్బార్‌ ఖాన్‌ తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగియడంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఇళ్లకు తరలివెళ్లారు. దీంతో విద్యార్థులు హుషారుగా తమ ఇళ్లకు పయనమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement