విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు పసివాడిపై కాఠిన్యం ప్రదర్శించాడు. సరిగ్గా చదవడం లేదనే సాకుతో విద్యార్థిని చితకబాదాడు.
హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు పసివాడిపై కాఠిన్యం ప్రదర్శించాడు. సరిగ్గా చదవడం లేదనే సాకుతో విద్యార్థిని చితకబాదాడు. ఎల్బీనగర్ హస్తినాపూర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలొ బాలాజీ దేవాదత్ అనే విద్యార్థిని తెలుగు టీచర్ చావగొట్టాడు.
విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అతడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని విచక్షణారహితంగా కొట్టిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు మొరపెట్టుకున్నారు.