
కాశ్మీర్ బాధితులకు యూత్ కాంగ్రెస్ విరాళం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుంచి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు.
జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుంచి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కాశ్మీర్కు భారీగా ఆర్థిక సహాయం, ఇతర సహాయక చర్యలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై ముందుగా ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కోరారు.