
ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి ఫాంహౌస్‌కు వచ్చారు.
సోమవారం వరకు ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, సీఎం వస్తున్నారనే సమాచారంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో సాయంత్రం నుంచే రోడ్డు మార్గాన బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌరారం, పాములపర్తి, శివారు వెంకటాపూర్ మీదుగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది.