తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గన్పార్క్ వద్ద తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ధర్నాకు దిగారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గన్పార్క్ వద్ద తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపనాథ్, అర్కే గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, రాజేందర్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులు హాజరైయ్యారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారంను బర్త్రఫ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అవి రైతుల ఆత్మహత్యలు కాదు.. సర్కారీ హత్యలేనని టీ టీడీపీ నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందిగా టీటీడీపీ నేతలు తెలంగాణ సర్కార్ ను డిమాండ్ చేశారు.