తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ దాడిపై వారు ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ దాడిపై వారు ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని వారు ఆరోపించారు. ఈ అంశంతో పాటు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని, ఇరు రాష్ట్రాల సీఎంలను సమావేశపరిచి విద్యుత్తో పాటు నీటి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ టీడీపీ నేతలు... గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.
అనంతరం తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ముందు విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సూచించారు. దాడులతో సమస్యలు పరిష్కారం కావని మోత్కుపల్లి అన్నారు.