399 మంది ఖైదీలకు సీఎం కేసీఆర్ క్షమాభిక్ష!

Telangana Government Plans To Release 399 Prisoners On 15th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 399 మంది ఖైదీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. ఖైదీల క్షమాభిక్ష పైలుపై ఈరోజు సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఆగస్టు 15న వారిని విడుదల చేస్తారు. ఈక్రమంలో ఖైదీల విడుదలకు అవసరమైన విధివిధానాలను పది రోజుల్లో పూర్తి చేయాలని హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్విని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 లో సత్ప్రవర్తన కలిగిన  ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవిత, జీవితేతర, తక్కువ శిక్షాకాలం ఖైదీలను విడుదల చేసింది. అదే తరాహాలో 2020 ఆగస్టు 15 న ప్రసాదించే ఖైదీల క్షమాభిక్ష జీవో ఉంటుందని తెలిసింది. ఖైదీలు, వారి కుటుంబాలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల పోరాటాల ఫలితం మూలంగానే తెలంగాణ ప్రభుత్వం స్పందించినట్టు సమాచారం. 

(జ్వ‌రం వ‌చ్చిన వారంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు : ఈట‌ల)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top