పోలింగ్‌ శాతంపై ఈసీ అధికారిక ప్రకటన

Telangana Election Commission Official Announced The Polling Percentage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంతో పోలిస్తే ఈ సారి ఓటింగ్‌ శాతం పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్‌ నమోదయిందని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలింగ్‌ నమోదైనట్టు చెప్పారు.

2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 శాతం నమోదవగా ఈ సారి ఓటింగ్‌ శాతం పెరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల పోలింగ్‌ 72.54 శాతం కాగా.. మహిళల పోలింగ్‌ 73.88 గా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల ఓటింగ్‌ శాతం కంటే మహిళల ఓటింగ్‌ శాతం పెరిగిందన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా (85.97 శాతం) పోలింగ్‌ నమోదవగా.. చార్మినార్‌ నియోజకవర్గంలో అత్యల్పంగా (40.18 శాతం) పోలింగ్‌ నమోదయిందన్నారు. 

జిల్లాల వారిగా ఓటింగ్‌ శాతం

ఆదిలాబాద్‌- 83.37
కరీంనగర్‌- 78.20
మంచిర్యాల- 78.72
పెద్దపల్లి - 80.58
కామారెడ్డి- 83.05
నిర్మల్‌ - 81.22
నిజామాబాద్‌- 76.22
జగిత్యాల- 77.89
రాజన్న సిరిసిల్ల- 80.49
సంగారెడ్డి- 81.94
మెదక్‌- 88.24
సిద్దిపేట- 84.26
రంగారెడ్డి- 61.29
వికారాబాద్‌- 76.87
మేడ్చల్‌, మల్కాజ్‌గిరి- 55.85
మహబూబ్‌నగర్‌- 79.42
నాగర్‌ కర్నూలు- 82.04
వనపర్తి- 81.65
జోగులాంబ- 82.87
నల్గొండ- 86.82
సూర్యాపేట- 86.63
యాదాద్రి భువనగిరి- 90.95
జనగామ- 87.39
మహబూబాబాద్‌- 89.68
వరంగల్‌ అర్బన్‌- 71.18
జయశంకర్‌ భూపాలపల్లి- 82.31
భద్రాద్రి కొత్తగూడెం- 82.46
ఖమ్మం- 85.99
వరంగల్‌ గ్రామీణం- 89.68
హైదరాబాద్‌- 48.89

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top