నారాయణపూర్‌ నీటిపై కర్ణాటకతో చర్చలు | Talk to Karnataka on the water of Narayanpur | Sakshi
Sakshi News home page

నారాయణపూర్‌ నీటిపై కర్ణాటకతో చర్చలు

Aug 11 2017 2:00 AM | Updated on Oct 19 2018 7:19 PM

ఎగువ నారాయణపూర్‌ నుంచి దిగువ నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై కర్ణాటకతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: ఎగువ నారాయణపూర్‌ నుంచి దిగువ నాగార్జునసాగర్‌కు నీటి విడుదలపై కర్ణాటకతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. గురు వారం సైతం సాగర్‌ సీఈ సునీల్‌ బెంగళూరులో కృష్ణా భాగ్య జల నిగమ్‌ ఏండీ అంజూమ్‌ ఫర్వేజ్‌తో చర్చలు జరిపారు.

హైదరాబాద్‌ ప్రజలకు, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు తాగునీటి కోసం 15 టీఎంసీలు మేర నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే శుక్రవారం కృష్ణా భాగ్య జల నిగమ్‌ బోర్డు సమావేశం జరుగనుండటంతో అక్కడే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement