 
															టీఆర్ఎస్ సత్తా చూపించాం: తలసాని
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సత్తా చూపించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
	హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సత్తా చూపించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లో తేల్చుకుందామన్న టీడీపీకీ కంటోన్మెంట్ ఫలితాలే సమాధానమని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని అన్నారు. ఉపాధ్యక్షులు ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.  చంద్రబాబు నాయుడు ఏజెంట్ల సత్తా బయటపడిందని తలసాని ఎద్దేవా చేశారు.
	
	కాగా ఇప్పటివరకూ  ఆరు వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఒకటవ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి గెలుపొందగా, 2వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కేశవరెడ్డి విజయం సాధించారు. 3వ వార్డులో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్, 4వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నళినీ కిరణ్ విజయం సాధించారు. అయిదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణ గెలుపొందగా, ఆరో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి పాండు యాదవ్ విజయం సాధించారు. ఇంకా రెండు వార్డుల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
