
ఎర్రబెల్లి దయాకర రావు
రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వరంగల్ జిల్లా పాలకుర్తి టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు.
కరీంనగర్: రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వరంగల్ జిల్లా పాలకుర్తి టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై నిలదీస్తామన్న భయంతోనే టీడీపి సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కాంగ్రెస్, టీడీపి కుమ్మక్కై అసెంబ్లీని నడుపుతున్నాయని ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల వారికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడక తప్పదని హెచ్చరించారు. ఎక్స్గ్రేషియా చెల్లించేవరకు టీడీపి రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని టీడీపి వదిలిపెట్టదని కూడా ఎర్రబెల్లి హెచ్చరించారు.
**