సస్పెండైన డీఈవోలకు తిరిగి పోస్టింగ్‌లు | suspended DEO's take into posting again | Sakshi
Sakshi News home page

సస్పెండైన డీఈవోలకు తిరిగి పోస్టింగ్‌లు

Nov 28 2015 11:51 PM | Updated on Nov 6 2018 8:51 PM

సస్పెన్షన్‌కు గురైనా ఇద్దరు మాజీ డీఈవోలకు తిరిగి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైనా ఇద్దరు మాజీ డీఈవోలకు తిరిగి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గత సెప్టెంబరులో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో మెదక్, వరంగల్ జిల్లాల విద్యాశాఖాధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా డీఈవోగా పనిచేసిన రాజేశ్వర్‌రావుకు టెట్ డెరైక్టర్ కార్యాలయంలో డిప్యూటి డెరైక్టర్‌గానూ, వరంగల్ డీఈవోగా పనిచేసిన చంద్రమోహన్‌కు ఎస్‌సీఈఆర్‌టీలో డిప్యూటి డెరైక్టర్‌గానూ పోస్టింగులు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement