వారిని రెగ్యులరైజ్‌ చేయాలి | sunnam rajayya about contract employees | Sakshi
Sakshi News home page

వారిని రెగ్యులరైజ్‌ చేయాలి

Nov 14 2017 2:30 AM | Updated on Nov 14 2017 2:30 AM

sunnam rajayya about contract employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు చాలీచాలని వేతనాలతో ప్రభుత్వం సరిపెడుతోందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు.

మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లా గురుకులాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు వసతులు కల్పించాలని డి మాండ్‌ చేశారు. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 

Advertisement

పోల్

Advertisement