సీషెల్స్‌కు రాష్ట్ర ఉద్యాన శాఖ టెక్నాలజీ

State Horticulture Technology for Seychelles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యాన శాఖ టెక్నా లజీని సీషెల్స్‌ దేశం అందిపుచ్చుకోనుంది. అధునాతన సాంకేతికతతో పాలీహౌస్‌లు నిర్మించి కూరగాయలు, పండ్ల తోటలు, పూలసాగును తమ దేశంలో చేపట్టేందుకు సహకరించాలని ఆ దేశ వ్యవసాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి అనుమతించారు. త్వరలోనే ఆ దేశ వ్యవసాయాధికారులు ఎనిమిది మంది రాష్ట్రంలో పర్యటించి పాలీహౌస్‌లు, పండ్ల తోటలు, ఇతర టెక్నాలజీపై శిక్షణ తీసుకోనున్నారు. సీషెల్‌లో 4 పాలీహౌస్‌ల నిర్మాణం చేపట్టి, వాటి పనితీరును కూడా వివరించాలని చేసిన విజ్ఞప్తి పై కూడా ఉద్యానశాఖ సంచాలకులు ఎల్‌.వెంకట్రామ్‌రెడ్డి కస రత్తు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల పనితీరు, పంటల సాగుపై అధ్యయనం చేయడానికి సీషెల్స్‌ వ్యవసాయశాఖ బృందం ఇటీవల మన దేశ పర్యటనకు వచ్చింది. రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జీడిమెట్లలో నడుస్తున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని సందర్శించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top