తండ్రిపై హత్యాయత్నం | Son attacks father with axe | Sakshi
Sakshi News home page

తండ్రిపై హత్యాయత్నం

Feb 27 2016 4:22 PM | Updated on Sep 2 2018 4:37 PM

కన్నకొడుకే గొడ్డలితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.

రామన్నపేట (నల్లగొండ) : కన్నకొడుకే గొడ్డలితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలెంనగర్‌లో శనివారం ఉదయం ఈ ఘటన  చోటుచేసుకుంది. సయ్యద్ జమాల్ (65) రెండో కుమారుడు సయ్యద్ మక్సూద్ మద్యానికి బానిసయ్యాడు.

ఈ క్రమంలో శనివారం ఉదయం మక్సూద్ మద్యం మత్తులో తండ్రి జమాల్‌పై గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జమాల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement