సేఫ్‌ సిటీ కోసమే షీటీమ్స్‌

She Teams For Safe City shikha goel - Sakshi

వేధింపులపై అవగాహనకు ‘నెక్ట్స్‌ స్టాప్‌’  

గన్‌ఫౌండ్రీ: హైదరాబాద్‌ను ప్రపంచంలోనే మహిళలకు అత్యంత భద్రతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సిటీ షీటీమ్స్‌ అడిషనల్‌ సీపీ షికాగోయల్‌ అన్నారు. ప్రజారవాణ వ్యవస్థలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల వేధింపులపై అవగాహన కల్పించేందుకు సిటీ ట్రాఫిక్‌ పోలీస్, రేడియో మిర్చి సహకారంతో ‘నెక్ట్స్‌ స్టాప్‌’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలి పారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను శుక్రవా రం ఆదర్శ్‌నగర్‌ హాకా భవన్‌లోని భరోసా కేం ద్రంలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ... ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళ లు, బాలికలు ధైర్యంగా తమకు సమాచారం అం దించాలని సూచించారు. ఇప్పటి వరకు షీటీమ్స్‌ బృందం 5వేల కేసులు నమోదు చేసిందన్నారు. ఇకపై మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులలో సైతం ప్రత్యే క దృష్టిసారిస్తామన్నారు. ఈవ్‌టీజింగ్, వివిధ రకాల వేధింపులపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్, రేడియో మిర్చి సహకారంతో రేడియో జాకీలు శనివారం నుంచి వారం రోజుల పాటు ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ శ్రీధర్, ఆర్‌జే షేజీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top