హెల్త్‌కార్డు..ఎప్పుడొస్తదో! | Serp employees waiting for health cards Renewal | Sakshi
Sakshi News home page

హెల్త్‌కార్డు..ఎప్పుడొస్తదో!

Sep 11 2017 1:09 PM | Updated on Sep 19 2017 4:22 PM

హెల్త్‌కార్డు..ఎప్పుడొస్తదో!

హెల్త్‌కార్డు..ఎప్పుడొస్తదో!

రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కార్డులను ప్రభుత్వం రెన్యువల్‌ చేయ కపోవడంతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారు.

ఎదురుచూస్తున్న ‘సెర్ప్‌’ ఉద్యోగులు
రాష్ట్రంలో సెర్ప్‌ ఉద్యోగులు4,200
హెల్త్‌ కార్డులు లేకున్నా వైద్యం చేయించుకున్న వారు 209
వైద్యానికి అయిన ఖర్చు రూ.89.82.లక్షలు


సెర్ప్‌లో 4,200 మంది పని చేస్తు న్నారు. వీరు ఒక్కొ క్కరు తమ వాటా ధనంగా రూ.4,000 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 చెల్లి స్తుంది. దీంతో ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదం డ్రులకు రూ.2 లక్షల వరకు వైద్యం అందుతుంది.

యాదాద్రి భువనగిరి నుంచి యంబ నర్సింహులు:
రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కార్డులను ప్రభుత్వం రెన్యువల్‌ చేయ కపోవడంతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఉద్యోగులు చనిపోయారు. ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించాల్సిన వాటాధనం చెల్లించకపోవడంతో హెల్త్‌ ఇన్సూ రెన్స్‌ పథకం నిలిచిపోయింది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 209 మంది వివిధ ఆస్పత్రుల్లో  చికిత్సలు పొంది రూ.89,82,839 లక్షలు సొం తంగా చెల్లించారు. గత ఏడాది కాలంగా సెర్ప్‌లో పనిచేస్తున్న హెచ్‌ఆర్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాల్సి ఉంది.

అప్పుల పాలవుతున్న ఉద్యోగులు..
ఫిబ్రవరి 8 నుంచి ప్రభుత్వం చెల్లింపులు ఆపేయడంతో ఎక్కడికక్కడ వైద్యసేవలు నిలిచిపోయా యి. అయితే తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు ఉద్యోగులు సొంత డబ్బులతో వైద్యం చేయిం చుకుంటున్నారు. ఆర్థిక స్థోమతలేని మరికొందరు  తాత్కాలిక వైద్య సేవలు పొందుతూ హెల్త్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఒక ఉద్యోగి రూ.1,19,933 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుని అప్పుల పాలయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 19 మంది, సంగారెడ్డిలో 19, రంగారెడ్డిలో 18, సిద్దిపేటలో 18, నిజామాబాద్‌లో 18, కరీంనగర్‌లో 10, ఎస్‌పీఎంయూ (హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయం) 11మంది హెల్త్‌కార్డులు లేకుండానే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement