కంటోన్మెంట్ ఎన్నికల్లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సాయన్నకు ఎదురుదెబ్బ తగిలింది.
కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎన్నికల్లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సాయన్నకు ఎదురుదెబ్బ తగిలింది. 4 వ వార్డు పికెట్ లో పోటీ చేసిన సాయన్న కూతురు లాస్య నందిత ఓటమి పాలైయ్యారు. లాస్య నందితపై 844 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు.
	
	 ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్ననానికి అన్ని ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 8 వార్డుల్లో నాలుగింటికి ఫలితాలు వెల్లడయ్యాయి. 2 వార్డులు టీఆర్ఎస్, 2 వార్డులు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
