జీఈఎస్‌ సదస్సు.. రెండో రోజు షెడ్యూల్ | Second day in ges2017 | Sakshi
Sakshi News home page

జీఈఎస్‌ సదస్సు.. రెండో రోజు షెడ్యూల్

Nov 29 2017 3:02 AM | Updated on Nov 29 2017 8:10 AM

Second day in ges2017 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండో రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది. ‘ఇన్నోవేషన్స్‌ ఆన్‌ వర్క్‌ఫోర్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌’ అనే అంశంపై చర్చాగోష్ఠితో ప్లీనరీ సెషన్‌ మొదలవుతుంది. ఈ చర్చలో ఇవాంకా ట్రంప్‌ పాల్గొంటారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్, డెల్‌ సీసీవో కరెన్‌ క్వింటోస్‌ ప్యానెల్‌ స్పీకర్లుగా వేదికపై ఉంటారు. చర్చ అనంతరం ఇవాంకా హోటల్‌కు వెళ్తారు.

బ్రేక్‌ ఔట్‌ సెషన్లు, మాస్టర్‌ క్లాసులు, వర్క్‌ షాపులు సాయంత్రం 5.15 గంటల వరకు కొనసాగుతాయి. సినీ నటులు రామ్‌చరణ్, ఆదితి రావు, ఐబీఎం ఇండియా చైర్మన్‌ వనితా నారాయణన్, క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షాభోగ్లే, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్, రమణ గోగుల, ఫ్లిప్‌కార్ట్‌ కో ఫౌండర్‌ సచిన్‌ బన్సాల్, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌తోపాటు వివిధ దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటారు. మిస్‌ వరల్డ్‌ మానుషీ ఛిల్లర్‌తో హర్షాభోగ్లే ఫైర్‌ సైడ్‌ చాట్‌తో రెండో రోజు సెషన్‌ ముగుస్తుంది.


రెండో రోజు కార్యక్రమాలివీ
10.15–11.15     స్టార్టప్‌ల పిచ్‌ కాంపిటీషన్‌
11.15–12.30     బ్రేక్‌ ఔట్‌ సెషన్స్, మాస్టర్‌ క్లాసులు, వర్క్‌షాపులు
12.30–1.30       భోజన విరామం
1.30–2.45         బ్రేక్‌ ఔట్‌ సెషన్స్, మాస్టర్‌ క్లాసులు
2.45–3.45         స్టార్టప్‌ల పిచ్‌ కాంపిటీషన్‌
3.45–4.30         బ్రేక్‌ ఔట్‌ సెషన్స్, మాస్టర్‌ క్లాసులు
4.30–5.15         ఫైర్‌ సైడ్‌ చాట్‌ విత్‌ మిస్‌ వరల్డ్‌ మానుషీ ఛిల్లర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement