
తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం 12 వ రోజుకు చేరింది.
సాక్షి, హైదరాబాద్: తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం 12 వ రోజుకు చేరింది. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
గత 12 రోజులుగా దీక్ష సాగిస్తున్న సంగీతకు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 200 మంది విద్యార్థులు బోడుప్పలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సంగీత ఇంటి వద్దకూ ర్యాలీ చేరుకుని ఆమెకు బాసటగా ఉంటామని ప్రకటించారు.