దుస్తుల దుకాణంలో భారీ చోరీ | robbery in cloth showroom at adilabad | Sakshi
Sakshi News home page

దుస్తుల దుకాణంలో భారీ చోరీ

Aug 21 2015 10:25 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ దుకాణంలో భారీ చోరి జరిగింది.

కడెం: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ దుకాణంలో భారీ చోరి జరిగింది. దుకాణం వెనుక భాగం నుంచి రంధ్రం చేసి వెళ్లిన దుండగులు రూ. 1.45 లక్షల నగదు, కొన్ని దుస్తులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కాగా, శుక్రవారం దుకాణం తెరిచిన యజమానికి దొంగతనం విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేప్టటారు. కేసు నమొదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement