ఏమైతదో ఏమో.. కిటికీలో నుంచే దరఖాస్తులు

Revenue Staff in Ibrahimpatnam Took Applications From Windows - Sakshi

ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారిని లోపలికి అనుమతించడం లేదు. తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అనంతరం కార్యాలయం సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. 

వారం తర్వాత విధుల్లోకి చేరిన రెవెన్యూ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్‌ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top