ఆదివాసీల స్థితిగతులపై పరిశోధన | Sakshi
Sakshi News home page

ఆదివాసీల స్థితిగతులపై పరిశోధన

Published Mon, Nov 26 2018 6:34 PM

Research On The Lifestyle Of Adivasis - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌రూరల్‌ : మండలంలోని చించుఘాట్‌ గ్రామంలో ఆదివాసీల స్థితిగతులు, ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లపై మధ్యప్రదేశ్‌లోని అమరకంఠన్‌ ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ప్రొఫెస ర్లు ఆదివారం పరిశోధన చేశారు. ఆదివాసీల జీవన విదానం, తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ రానురానూ గోండి భాష కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. పుట్టుక నుంచి చావు వరకు దేవతలను పూజించడం, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన పాటలు, తదితర వాటిని రికార్డింగ్‌ చేసుకున్నామని ప్రొఫెసర్లు వెల్లడించారు. ఈ ప్రొఫెసర్ల బృందంలో వినయ్‌కుమార్‌ తివారీ, బిరేంద్ర ప్రతాప్‌సింగ్, సౌరభ్‌ కుమార్, హేమంత్‌రావు, గ్రామ పెద్దలు లింగు, అనిల్‌కుమార్, బిపిన్‌కుమార్, హర్షన్‌రావు, తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement