‘లిమ్కా బుక్’లోకి అరుదైన ఆపరేషన్ | Rare operation into the 'Limca Book " | Sakshi
Sakshi News home page

‘లిమ్కా బుక్’లోకి అరుదైన ఆపరేషన్

Mar 30 2016 5:04 AM | Updated on Sep 3 2017 8:49 PM

‘లిమ్కా బుక్’లోకి అరుదైన ఆపరేషన్

‘లిమ్కా బుక్’లోకి అరుదైన ఆపరేషన్

కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గర్భిణికి అరుదైన ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడిన వరంగల్ జిల్లా జనగామ ఏరియూ ఆస్పత్రి ఆర్‌ఎంవో సుగుణాకర్‌రాజుకు

జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంవో ఘనత
 

 జనగామ: కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న గర్భిణికి అరుదైన ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడిన వరంగల్ జిల్లా జనగామ ఏరియూ ఆస్పత్రి ఆర్‌ఎంవో సుగుణాకర్‌రాజుకు లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం  విలేకరులకు వెల్లడించారు. నర్మెట మండలం సోలిపురం గ్రామానికి చెం దిన శ్రీనివాస్, రమాదేవి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. రమాదేవికి పురిటినొప్పులు రావడం, వాంతులు చేసుకోవడంతో కోమాలోకి వెళ్లింది.

మెదడు లో రక్తం గడ్డకట్టి పక్షవాతంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంది.   సుగుణాకర్‌రాజును సంప్రదించగా హైదరాబాద్‌లోని కాకతీయ ఆస్ప త్రిలో చేర్పించారు. మరుసటి రోజు  రమాదేవికి ఎండోస్కోపీ చేయగా కడుపులో బిడ్డబతికే ఉంది. అయితే, ఆపరేషన్ చేయడానికి వైద్యులు నిరాకరిం చారు. సుగుణాకర్‌రాజు సొంత పూచీకత్తుతో శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడారు. పక్షవాతంతో బాధపడుతున్న రమాదేవిని కేవ లం 18 రోజుల్లోనే మామూలు మనిషిని చేశారు. దీంతో సుగుణాకర్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement