ఆస్పత్రుల్లో ప్రసూతికి ప్రోత్సాహకాలు | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో ప్రసూతికి ప్రోత్సాహకాలు

Published Wed, Jan 18 2017 3:04 AM

ఆస్పత్రుల్లో ప్రసూతికి ప్రోత్సాహకాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపునకు చర్యలు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ‘అమ్మ ఒడి’ వాహనాల గురించి టీఆర్‌ఎస్‌ సభ్యులు గొంగిడి సునీత, అజ్మీరా రేఖ, కోవా లక్ష్మి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధా నమిచ్చారు. గిరిజన ప్రాంతాలలో ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమం చేపట్టామన్నారు.

ఈ పథకం కింద గర్భిణులకు వైద్యసాయం అందించేందుకు 41 వాహనాలను ఏర్పాటు చేశామని.. కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర మంతటా విస్తరిస్తామన్నారు. తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలోనూ ప్రసూతి ప్రోత్సాహకాలను ఇచ్చే యోచన ఉందని.. వచ్చే బడ్జెట్‌లో మంచి పథకంతో ముందు కొస్తామని చెప్పారు. అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారన్న అంశం ప్రభుత్వ దృష్టిలో ఉందని.. దాన్ని నివారించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు.

ఆశ వర్కర్లకు చేయూతనివ్వండి: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి
గర్భిణులకు సేవల అంశంపై కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి (కాంగ్రెస్‌) మాట్లాడు తూ.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు ఆశ వర్కర్లు మంచి సేవలు అందిస్తున్నా రని, వారు కోరినట్లుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement
Advertisement