రెండు రోజులు..రూ. 2 కోట్లు | profit Rs.2 crore at survey time to district | Sakshi
Sakshi News home page

రెండు రోజులు..రూ. 2 కోట్లు

Aug 22 2014 3:09 AM | Updated on Oct 17 2018 6:06 PM

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పుణ్యమా అని ఆర్టీసీకీ లాభాల పంట పండింది. సర్వే ప్రారంభానికి ముందు ఆదాయం బాగానే వచ్చింది.

నిజామాబాద్ నాగారం : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పుణ్యమా అని ఆర్టీసీకీ లాభాల పంట పండింది. సర్వే ప్రారంభానికి ముందు ఆదాయం బాగానే వచ్చింది. సర్వే పూర్తయిన తరువాత కూడా ఆదాయం వస్తోంది.  జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటాలాడుతున్నాయి. కేవలం రెండు రోజుల్లో సుమారు  రూ. 2కోట్ల ఆదాయం సమకూరింది.  బుధవారం సుమారు రూ.94లక్షల ఆదాయం రాగా, గురువారం రూ. కోటిపైనే వచ్చింది. ప్రయాణికులు ఎప్పుడు లగ్జరీ బస్సుల్లో వచ్చేవారు. ఈసారి మాత్రం సర్వేకు రావడానికి, తిరుగు ప్రయాణానికి పల్లెవెలుగులను ఆశ్రయించారు.

 నాన్‌స్టాప్‌గా పల్లె వెలుగులు
  ఇంద్ర, సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సు లు సరిపడక పోవడంతో ఏకంగా పల్లెవెలుగులు బస్సులను రంగంలోకి దించారు. ప్రయాణికుల తాకిడి దృష్ట్యా వాటిని నడిపించారు.  కొన్నింటికి ఎక్స్‌ప్రెస్, మరి కొన్నింటికి నాన్‌స్టాప్ బోర్డులు పెట్టకుండానే ప్రయాణం సాగించారు. విచారణ కేంద్రం, టికెట్  కౌంటర్ల వద్ద ప్రయాణికులు పెద్దఎత్తున బా రులు తీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement