ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డికి రాష్ట్రపతి మెడల్‌

Presidential Medal to ACB deputy director Madhusudan Reddy - Sakshi

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులకు కేంద్రం సేవా పతకాలు

తెలంగాణ నుంచి 13 మందికి ప్రతిభా పురస్కారాలు

సాక్షి, న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన (మెరిటోరియస్‌) పోలీసులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఏసీబీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.మధుసూదన్‌రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం దక్కింది. మరో 13 మందిని ప్రతిభా పురస్కారాలు వరించాయి. పతకాలకు ఎంపికైన అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట, 15 మందికి ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఏపీ నుంచి స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌(బీఆర్‌ఏ) ఎస్పీ అడ్డాలవెంకటరత్నం, విశాఖ డీఎస్పీ కె.వెంకటరామకృష్ణప్రసాద్‌లను రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి. 

తెలంగాణ నుంచి ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన వారు.. 
ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ, సంగారెడ్డి; ఎం.నారాయణ, ఏఐజీ శాంతిభద్రతలు; సంగిపాగి ఫ్రాన్సిస్, అస్సాల్ట్‌ కమాండర్‌ గ్రేహౌండ్స్‌; బి.రామ్‌ప్రకాశ్, కమాండెంట్‌ టీఎస్‌ఎస్‌పీ, ఖమ్మం; ఇ.రామచంద్రారెడ్డి, ఎస్పీ ఎన్‌సీ, రాచకొండ; డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ, కొత్తగూడెం; ఎస్‌. ప్రభాకర్‌రావు, డీఎస్పీ, (ఫింగర్‌ప్రింట్స్‌); వి.సూర్యచంద్ర రావు, డీఎస్పీ, ఎస్‌సీఆర్‌బీ; ఖాజా మొయినుద్దీన్, ఎస్‌ఐ, హైదరాబాద్‌; సయ్యద్‌ మక్బూల్‌ పాషా, ఎస్‌ఐ, వరంగల్‌; మహ్మద్‌ ఆలీఖాన్‌ ముక్తార్, ఏఆర్‌ఎస్‌ఐ, హైదరాబాద్‌; జి.లక్ష్మీనరసింహారావు, హెడ్‌కానిస్టేబుల్, హైదరాబాద్‌; మహ్మద్‌ అజీజుద్దీన్, హెడ్‌కానిస్టేబుల్, ఏసీబీ వరంగల్‌. 

ఏపీ నుంచి ప్రతిభా పురస్కారాల గ్రహీతలు..
ఎస్‌.హరికృష్ణ, ఎస్పీ ఇంటెలిజెన్స్, విజయవాడ; వి.సత్తిరాజు, డీఎస్పీ (ఏఆర్‌), రాజమహేంద్రవరం; కేఎస్‌.వినోద్‌కుమార్, డీఎస్పీ, కర్నూలు; కె.జనార్దననాయుడు, డీఎస్పీ, ఇంటెలిజెన్స్, తిరుపతి; పి.మోహన్‌ ప్రసాద్, అదనపు కమాండెంట్, విశాఖపట్నం; పి.కిరణ్‌కుమార్, అస్సాల్‌ కమాండర్‌ గ్రేహౌండ్స్, హైదరాబాద్‌; వి.వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్, సీఐ సెల్, విజయవాడ; బి.రాజశేఖర్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పీటీసీ), ఒంగోలు; ఎం.వెంకటగణేశ్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్, ఏసీబీ, విశాఖపట్నం; ఎన్‌.గుణశేఖర్, ఎస్‌ఐ, రోడ్‌ సేఫ్టీ, బంగారుపాళ్యం; షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌ బాషా, ఏఆర్‌ఎస్‌ఐ ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, హైదరాబాద్‌; జి.వెంకటరామారావు, హెడ్‌కానిస్టేబుల్, విశాఖపట్నం; గోపిశెట్టి సుబ్బారావు, హెడ్‌కానిస్టేబుల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్, విజయవాడ; వై.వీరవెంకట సత్యసాయిప్రకాశ్, హెడ్‌కానిస్టేబుల్, పోరంకి; జి.వెంకటేశ్వరరావు, రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్, విజయవాడ. 

తెలంగాణ నుంచి జైళ్ల శాఖలో ముగ్గురికి.. 
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జైళ్ల శాఖ అధికారులకు కేంద్రం ‘కరెక్షనల్‌ సర్వీస్‌ మెడల్స్‌’ ప్రకటించింది.  తెలంగాణ నుంచి ముగ్గురు.. ఏపీ నుంచి ముగ్గురు అధికారులను పతకాలు వరించాయి. తెలంగాణ నుంచి చీఫ్‌ హెడ్‌ వార్డర్‌లు ఎస్‌.వెంకటేశ్వర్లు (మహబూబాబాద్‌), జి.ముక్తేశ్వర్‌ (రిటైర్డ్, నల్లగొండ), సయ్యద్‌ ఖాజాపాషా (చర్లపల్లి)లకు పురస్కారాలు దక్కాయి. ఏపీ నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి సబ్‌జైలు హెడ్‌వార్డర్‌ వేమూరి వెంకటకోటి వీరదుర్గాప్రసాద్‌కు విశిష్ట సేవా పతకం లభించింది. ఏపీ నుంచి జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్ధన్‌కు, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ గంగ సాయిరామ్‌ ప్రకాశ్‌లకు ప్రతిభా పురస్కారాలు వరించాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top