
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సందర్భంగా తనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదని వచి్చన వార్తలపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ వీడ్కోలు సమావేశానికి రావాల్సిందిగా నాకు ప్రగతిభవన్ నుంచి ఫోన్ వచి్చంది. అయితే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు చేయాల్సిన ఫోన్ నాకు పొరపాటున వచి్చనట్లుగా తర్వాత గుర్తించారు. ఆ విషయం తెలియక నేను ప్రగతిభవన్‌కు వెళ్లాను. మంత్రు లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం ఉండటంతో.. అదే సమయంలో వచి్చన మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ లోనికి వెళ్లి ఉంటారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఏమీలేదు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు’ అని ఆమె అన్నారు.