జీవో 550 పునఃసమీక్ష కేసు 21కి వాయిదా | Postponed to go 550 review case | Sakshi
Sakshi News home page

జీవో 550 పునఃసమీక్ష కేసు 21కి వాయిదా

Aug 15 2018 2:58 AM | Updated on Aug 31 2018 8:47 PM

Postponed to go 550 review case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ అడ్మిషన్స్‌కు సంబంధించి జీవో 550లోని పేరా 5(2) అమలు చెల్లదని హైకోర్టు వెలువరించిన తీర్పు పునఃసమీక్ష పిటిషన్‌పై విచారణ 21వ తేదీకి వాయిదాపడింది. జీవో నిబంధనలకు అనుగుణంగా తొలుత 50 శాతం ఓపెన్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలని, ఆ తర్వాత మిగిలిన 50 శాతం సీట్లను రిజర్వేషన్‌ కోటాలో భర్తీచేసేలా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఆదేశాలు ఇవ్వాలని కె.ఉర్జిత యాదవ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్‌ న్యాయవాది మంగళవారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

పిటిషన్‌ను వచ్చేవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈలోగా ప్రభుత్వాల వైఖరి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఓపెన్‌ కేటగిరీ సీటును ఎంపిక చేసుకుని ఆ తర్వాత దానిని వదులుకుని మరో కాలేజీలో రిజర్వేషన్‌ కేటగిరీ కోటా సీటులో చేరితే, వారు వదులుకున్న సీటును అదే సామాజికవర్గంలోని అభ్యర్థితోనే భర్తీ చేసేందుకు వీలుకల్పించే జీవోలోని ఆ పార్ట్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement