తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నది ఉప్పొంగుతోంది.
సిర్పూర్(టి) : నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నది ఉప్పొంగుతోంది. సిర్పూర్(టి) మండలంతోపాటు సమీపంలోని మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతోపాటు మహారాష్ట్రలోని వార్దా నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది.
మంగళవారం పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల ప్రజలతోపాటు సమీపంలోని మహారాష్ట్ర గ్రామాల ప్రజ లు భయాందోళనలకు గురయ్యారు. పెన్‌గంగ వంతెన పైకప్పుకు ఆనుకుని వరదనీరు ప్రవహిస్తుండటంతో ఏ క్షణమైనా రాకపోకలు స్తంభిస్తాయని సమీప గ్రామాల ప్రజలు తమ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు.