రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. | Other Party Peoples Join Congress In Adilabad | Sakshi
Sakshi News home page

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Jul 5 2018 1:15 PM | Updated on Mar 18 2019 9:02 PM

Other Party Peoples Join  Congress In Adilabad - Sakshi

కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానిస్తున్న ఆత్రం సక్కు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు, డీసీసీ ప్రధానకార్యదర్శి విశ్వప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని వంకులం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ప్రేందాస్‌తో పాటు సుమారు 200 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన, ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పాటు పడింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. నాడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

నేడు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకునే వాళ్ల కోసమే తప్పా ప్రజల కోసం పాలన సాగించడం లేదన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్, పీఏసీఎస్‌ చైర్మన్‌ రవీందర్, వైస్‌ చైర్మన్‌ వెంకటేశంచారి, కిసాన్‌ సేత్‌ జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్‌గౌడ్, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మునీర్‌ అహ్మద్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మంగ, యువజన అధ్యక్షుడు జగన్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement