ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి పరిస్థితి విషమం | one injured when two bikes crashes | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

Mar 14 2015 9:07 PM | Updated on Sep 2 2017 10:51 PM

నల్గొండ జిల్లా నడిగూడెం మండలంలోని నారాయణపురం క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

నల్గొండ: నడిగూడెం మండలంలోని నారాయణపురం క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.  వివరాలు...రెండు ద్విచక్ర వాహనాలు నారాయణపురం క్రాస్ వైపుకు వస్తుండగా మలుపు తిరిగే ప్రయత్నంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం శనివారం చోటుచేసుకుంది.  ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సిరిపురానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు ద్విచక్ర వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి.
(నడిగూడెం)

Advertisement
 
Advertisement
Advertisement