పండుటాకుల పాట్లు | old women waiting for pension | Sakshi
Sakshi News home page

పండుటాకుల పాట్లు

Sep 8 2014 2:24 AM | Updated on Oct 8 2018 5:04 PM

పండుటాకుల పాట్లు - Sakshi

పండుటాకుల పాట్లు

పింఛన్ల కోసం పండుటాకుల పాట్లు ఇవి. మూడు, నాలుగు రోజులుగా పింఛన్ల కోసం వృద్ధులు మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు.

జడ్చర్ల: పింఛన్ల కోసం పండుటాకుల పాట్లు ఇవి. మూడు, నాలుగు రోజులుగా పింఛన్ల కోసం వృద్ధులు మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆదివారం మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు.

కొద్దిసేపటి తర్వాత నీరసించి రోడ్డుపైనే పడుకున్నారు. ఎవరూ స్పందించకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయాన్ని విలేకరులు నేరుగా ఫోన్‌లో కలెక్టర్ ప్రియదర్శిని దృష్టికి తీసుకెళ్లగా సోమవారం పింఛన్లు ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించి వెనుదిరిగారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement