తెలంగాణ రాష్ట్రంలో చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం సరికాదని ఐజేయూ నేత దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం సరికాదని ఐజేయూ నేత దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. రాజ్యాంగంలో భావప్రకటన స్వేచ్ఛకు విస్తృతమైన అర్థం ఉందని గుర్తు చేశారు.
మీడియా స్వేచ్ఛను ఎవరు అడ్డుకోలేరన్నారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులను అపహాస్యం చేస్తూ కొన్ని టీవీ చానళ్లు తమ కార్యక్రమాల్లో ప్రసారం చేశాయి. దీంతో ఆగ్రహించిన ఎమ్ఎస్వోలు ఆయా చానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు. తమ చానెళ్లను ప్రసారం చేయాలంటూ ఆయా చానెళ్ల జర్నలిస్టులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.