నూతన సంవత్సరం(2015) సందర్భంగా నిర్వహించే వేడుకలు వినోదపన్ను పరిధిలోకే వస్తాయని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం(2015) సందర్భంగా నిర్వహించే వేడుకలు వినోదపన్ను పరిధిలోకే వస్తాయని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నిర్వాహకులు ముందుగా సంబంధిత వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు సమాచారం అందించి నమోదు చేసుకోవాలని సూచించారు.
ముందస్తు సమాచారం అందించకుండా, వినోదపన్ను చెల్లించకుండా ఈవెంట్లు నిర్వహించే వారి పట్ల వాణిజ్య పన్నుల శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నిర్వాహకులపై ఐదు రెట్ల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు వాణిజ్యపన్నుల శాఖ సర్కిల్ అధికారులను కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జాయింట్ కమిషనర్(9949994728)ను గాని సంప్రదించాలని తెలిపారు.