మండలంలోని వడాయిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన రియల్టర్ జయరాములు ఉదంతం మిస్టరీగా మారింది. ఇతని మృతి వెనక రియల్
భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన రియల్టర్ జయరాములు ఉదంతం మిస్టరీగా మారింది. ఇతని మృతి వెనక రియల్ ఎస్టేట్‌కు సం బంధించిన తగాదాలు గానీ, లేదా ఇం కేమైనా కారణాలు ఉండవచ్చా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యులు మాత్రం ఇది హత్యే నంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూ రుకు చెందిన సీసీ జయరాములు(53) గతంలో గ్రామానికి మాజీ సర్పంచ్‌గా పని చే శారు. ఈయన యాదగిరిగుట్టలో నివాసం ఉంటుఉంటూ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ కోసం సురేంద్రపురి సమీపంలోని తన సొంత గెస్ట్‌హౌస్‌కు వెళ్లాడు.
సమయం 8 గంటలవుతున్నా తిరిగి రాకపోవడంతో గెస్ట్‌హౌస్ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న అశోక్ వెతకడానికి వెళ్లగా పూ ల చెట్ల మధ్యన జయరాములు కదల కుండా బోర్లా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు సంఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే జయరాములు మృతి చెంది ఉన్నాడు. మృ తుడి ముఖం, పొట్ట, మర్మావయాలు, కాళ్లపై తీవ్రమైన గాయాలుండటమే కాకుండా రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో జయరాములుది హత్యేనంటూ అను మానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా చేశారు. మృతదేహానికి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటన స్థలం వద్ద లభించిన ఆనవా ళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
మృతిపై అనుమానాలెన్నో?
జయరాములు మృతిపై పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్రపురి సమీపంలో గల తన సొంత గెస్ట్‌హౌజ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహించే జయరాములు ఉదయాన్నే అక్కడ చనిపోవడం, అతని శరీ రంపై పలు చోట్ల గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గత వారం రోజులుగా విదేశాల్లో ఉంటున్న ఓ రియల్టర్‌కు, జయరాములుకు మధ్య భూ వివాదం నడుస్తున్నట్లు సమాచా రం. ఓ భూమికి సంబంధించి లక్షల రూ పాయల లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం జయరాములు మృతికి కా రణమై ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. శనివారం రాత్రి నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు వచ్చి గెస్ట్ హౌస్‌లో బస చేశారని తెలుస్తుంది. వా రే ఉదయం 7గంటల సమయంలో జ యరాములును హత్య చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. జయరాములు చనిపోయిన తర్వాత కొత్త వ్యక్తు లు కన్పించకుండా పోయారు.
బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే
భిక్షమయ్యగౌడ్ పరామర్శ
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ భువనగిరి ఏరియా ఆస్పత్రికి వచ్చి జయరాములు మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయరామలు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధవుల రోధనలు మిన్నంటాయి.