మున్సిపల్‌ ఎన్నికలు జరిగేనా..?

Muncipal Elections Dilemma In Telangana - Sakshi

వార్డుల విభజనపై నాయకుల ఆందోళన

ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు

నేడే మున్సిపల్‌ ఎన్నికలపై కోర్టు తీర్పు

సాక్షి, జహిరాబాద్‌: జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు మున్సిపాలిటీలు కాకుండా సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందోల్‌– జోగిపేటలలో 2014లో ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార పార్టీకి అనుగుణంగానే వార్డుల విభజన చేశారనే కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. రేపో, మాపో రిజర్వేషన్లు వెలువడతాయన్న తరుణంలోనే విషయం కోర్టుకెక్కింది. అంతేకాకుండా జహీరాబాద్‌ మున్సిపాలిటీలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ కొందరు కోర్టుకెక్కారు కూడా. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల హడావిడికి ఒక్కసారిగా బ్రేక్‌ పడినట్లయింది. 

నేటితో టెన్షన్‌కు తెర..
మున్సిపల్‌ ఎన్నికలపై స్పష్టత రాకపోవడంతో ఆశావహులు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. పోటీలో నిలిచి  ఉండాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కొందరు ఆశావహలు ఆయా వార్డుల్లోని కాలనీల్లో ప్రజలతో మమేకమై వారి కష్ట, సుఖాలను తెలుసుకుంటూ  దూకుడుపెంచారు. ఈలోగా విషయం కోర్టుకెక్కడంతో డీలా పడ్డారు. వారంతా ఈ నెల 29న (నేడు)  కోర్టు ఇచ్చే తీర్పు కోసమే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.  

నోటిఫికేషన్‌ తర్వాతే రిజర్వేషన్లు
కోర్టు తీర్పు ఎలా ఉన్నా రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రం నోటిఫికేషన్‌ తర్వాతే జరిగే అవకాశం ఉంది. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వగానే వార్డుల విభజన ఆధారంగా, బీసీ ఓటర్ల గణన ప్రకారం ఆయా వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Read also in:
Back to Top