తహసీల్దార్‌ లైంగిక వేధింపులు

MRO Harassment On VRA In Nizamabad - Sakshi

డీటీకి ఫిర్యాదు చేసిన వీఆర్‌ఏ

మోర్తాడ్‌(బాల్కొండ): ఏర్గట్ల తహసీల్దార్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్‌ఏ ఒకరు గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ సుజాతకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏర్గట్ల వీఆర్‌ఏగా పని చేస్తున్న రజిత కొన్ని రోజుల నుంచి తన భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఇది అవకాశంగా తీసుకున్న తహసీల్దార్‌ లక్ష్మణ్‌ కొన్ని రోజుల నుంచి తనతో అనైతికంగా వ్యవహరిస్తూ లోబరచుకోవాలని ప్రయత్నిస్తున్నాడని వీఆర్‌ఏ ఆరోపించారు. ఎన్నికల విధులను నిర్వహించే సమయంలోనూ తనతో అసభ్యకరంగా వ్యవహరించారని రజిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తోటి వీఆర్‌ఏలకు ఒక విధమైన విధులను అప్పగిస్తూ, తనకు మాత్రం మరో విధమైన డ్యూటీలను అప్పగిస్తు అవమానపరిచాడని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top