కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.
రంగారెడ్డి(కుల్కచర): కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కుల్కచర్ల మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కుల్కచర్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ,శ్రీలత భార్య, భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు.
చిన్న కొడుకు రాజు తల్లి శ్రీలతతో తరచూ గొడవపడుతుండేవాడు. సోమవారం కూడా వీరిద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొడుకు తరచూ వాగ్వివాదానికి దిగడంతో మనస్తాపం చెందిన శ్రీలత సోమవారం మద్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తులో ఉందని పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.