కొడుకు ఇక లేడని ఆగిన తల్లి గుండె  | Mother and Son Died at Jagathala District | Sakshi
Sakshi News home page

కొడుకు ఇక లేడని ఆగిన తల్లి గుండె 

Apr 8 2019 5:04 AM | Updated on Apr 8 2019 5:04 AM

Mother and Son Died at Jagathala District - Sakshi

కథలాపూర్‌(వేములవాడ): ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్‌బాట పట్టిన కొడుకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన తల్లి గుండె ఆగిపోయింది. తల్లీకొడుకుల మృతితో జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం పోతారంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన గుంటుక నర్మద–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అప్పులు పెరిగిపోవడం, ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో ఇద్దరు కొడుకులు గల్ఫ్‌బాట పట్టారు.

కాగా, చిన్నకొడుకు గుంటుక గణేశ్‌ ఈనెల 3న బహ్రెయిన్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి గణేశ్‌ తల్లి నర్మద విలపిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం నర్మద (58) ఆకస్మికంగా మృతిచెందింది. కాగా, మృతురాలి భర్త మల్లయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకు శవాన్ని చివరిచూపు చూడకుండానే తల్లి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement