‘రాజకీయ జీవితం ఉన్నంతవరకూ ఇక్కడే’ | Minister KTR laid the foundation stone to mission bhagiratha works for sircilla town. | Sakshi
Sakshi News home page

‘రాజకీయ జీవితం ఉన్నంతవరకూ ఇక్కడే’

Jun 21 2017 6:23 PM | Updated on Sep 5 2017 2:08 PM

ఐటీ, పట్టణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం సిరిసిల్ల అభివృద్ధిపై పుస్తకాన్ని ఆవిష్కరించారు.



సిరిసిల్ల: ఐటీ, పట్టణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం సిరిసిల్ల అభివృద్ధిపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిరిసిల్లను కేటీఆర్‌ విడిచి వెళ్లడం జరగదని, రాజకీయ జీవితం ఉన్నంతవరకూ ఇక్కడ ప్రజలతోనే ఉంటానని అన్నారు. చేనేత కార్మికులు గౌరవంగా బతికే ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం నేత కార్మికుల సంక్షేమానికి రూ.200 కోట్లు ఇచ్చామని కేటీఆర్‌ తెలిపారు. వచ్చే దసరా నాటికి 400 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ వర్షాకాలంలో మిడ్‌మనేర్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. ఆరు నెలల్లో ఇంటింటికి నల్లా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ అనేక కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాగా కేటీఆర్‌  సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement