సగం ఓట్లు టీఆర్‌ఎస్‌కే | Medchal District Half Votes Get TRS party | Sakshi
Sakshi News home page

సగం ఓట్లు టీఆర్‌ఎస్‌కే

Dec 13 2018 9:13 AM | Updated on Dec 13 2018 9:13 AM

Medchal District Half Votes Get TRS party - Sakshi

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 22,25,04 ఓట్లు ఉండగా, 12,40,441 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో ప్రధాన పార్టీలైన  టీఆర్‌ఎస్‌ ప్రజాకూటమి, బీజేపీ, బీఎస్పీ  చెందిన 17 మంది అభ్యర్థులకు 11,81,665 ఓట్లు వచ్చాయి. జిల్లాలో  మిగిలిన  çస్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలకు చెందిన 115 అభ్యర్థులకు 58,776 ఓట్లు పడ్డాయి.  జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన  టీఆర్‌ఎస్‌ పార్టీకి  6,63,774 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ప్రజాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ )కి 3,65,245 ఓట్లు వచ్చాయి.

కుత్బుల్లాపూర్, మేడ్చల్‌ నియోజకవర్గాల  కాంగ్రెస్‌ అభ్యర్థులకు 1,92,334 ఓట్లు రాగా, ఉప్పల్, కూకట్‌పల్లి నుంచి  పోటీ చేసిన టీడీపీకి 1,39,165 ఓట్లు, మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన టీజేఎస్‌కు 34,219 ఓట్లు  వచ్చాయి.  ఐదు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 1,12,024 ఓట్లు సాధించింది. మేడ్చల్, కూకట్‌పల్లి నుంచి  బరిలో నిలిచిన బీఎస్పీకి 38,590 ఓట్లు రాగా, మేడ్చల్‌ నుంచి  బరిలోకి దిగిన నక్క ప్రభాకర్‌గౌడ్‌ 25,829 ఓట్లు పొంది  మూడవ స్థానంలో నిలిచారు. కూకట్‌పల్లి నుంచి బరిలో నిలిచిన హరీష్‌ చందర్‌ రెడ్డికి 12,761 ఓట్లు వచ్చాయి.   బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇద్దరూ టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన వారే కావటం గమనార్హం. జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో 132 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన 17 మంది మినహా, మిగిలిన 115 మంది స్వతంత్ర, ఇతర చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే జిల్లాలో నోటాకు 14,682 ఓట్లు పోలవడం గమనార్హం. ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కూడా 163 ఉన్నాయి.   నియోజకవర్గాల వారిగా ప్రధాన పార్టీలు పొందిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement