మండలంలోని అందనాలపాడు కొత్తతండాలో అప్పుల బాధతో ధరావతు రాజేష్(25) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్ : మండలంలోని అందనాలపాడు కొత్తతండాలో అప్పుల బాధతో ధరావతు రాజేష్(25) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.... రాజేష్ తన తండ్రితో కలిసి 7 ఎకరాల్లో పత్తి, మిరప సాగు చేశారు. పంట సరిగా పండకపోయే సరికి సుమారు రూ.5 లక్షల అప్పు అయింది. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజేష్ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే బంధువులు రాజేష్‌ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్ మరణించాడు. రాజేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
(డొర్నకల్)