స్పృహలోకి వచ్చిన మధులిక 

Madhulika comes into Consciousness - Sakshi

సహజస్థితికి బీపీ, పల్స్‌రేటు.. కత్తిగాట్లకు 7 గంటల పాటు చికిత్స.. 

నేడు వెంటిలేటర్‌ తొలగించే అవకాశం.. అయినా విషమంగానే ఆరోగ్యం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో 2రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు మధులిక(17) ఆరోగ్యం శుక్రవారానికి కొంత మెరుగుపడింది. 2 రోజుల నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందు తున్న ఆమె శుక్రవారం స్పృహలోకి వచ్చింది. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తుండటంతో పాటు బీపీ, పల్స్‌రేటు సహజస్థితికి చేరుకు న్నాయి. న్యూరోసర్జన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ భొట్ల, ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చంద్రమౌలి, వాస్క్యూలర్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రకాశ్, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ సాయిబాబా, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రసీద్‌లతో కూడిన వైద్య బృందం సుమారు 7 గంటలు శ్రమించి ఆమె తల, ఇతర భాగాలకైన గాయాలకు చికిత్స చేశారు.

విరిగిన చేతి ఎముకలకు రాడ్డు సాయంతో సరిచేశారు. గదుమ, మెడ, మోచేతి భాగాల్లోని కత్తిగాట్లను శుభ్రం చేసి, గాయాలకు కుట్లు వేశారు. రక్త స్రావం పూర్తిగా నియంత్రించారు. ఇప్పటి వరకు పదిబాటిళ్లకు పైగా రక్తం ఎక్కించారు. ఉన్మాది ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండటం వల్ల తలపై గాయానికి ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ..ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం వెంటిలేటర్‌ నుంచి బయటికీ తీసుకురానున్న ట్లు తెలిపారు. మధులిక స్వయంగా శ్వాస తీసు కోగలిగి..ఇన్‌ఫెక్షన్‌ నుంచి బయటపడాల్సి ఉంది. మరో 48 గంటలు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్య బృందం స్పష్టం చేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top