దాడికి గురైన న్యాయవాది మృతి | lawer attacked on jun1st dies in hospital | Sakshi
Sakshi News home page

దాడికి గురైన న్యాయవాది మృతి

Jun 7 2015 7:26 PM | Updated on Apr 3 2019 8:07 PM

అకారణంగా కొంతమంది ఆకతాయిలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

హైదరాబాద్: అకారణంగా కొంతమంది ఆకతాయిలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమంజిల్ కాలనీకి చెందిన న్యాయవాది కె.జి.కె ప్రసాద్ (58) ఈ నెల 1న రాత్రి కారులో పంజగుట్ట నుంచి సోమాజీగూడ యశోదా ఆస్పత్రి వైపు వెళుతుండగా...కొంతమంది యువకులు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు నిలిపి మాట్లాడుతున్నారు. తప్పుకోవాలని కోరిన ప్రసాద్‌పై ఐదుగురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

అప్పటి నుంచి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రసాద్ భార్య కనకదుర్గ ఫిర్యాదు మేరకు దాడి జరిగిన మరుసటి రోజే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా వారిపై నమోదు చేసిన హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement