ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష  | KCR Review Over TSRTC Strike Again | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష 

Nov 15 2019 3:21 AM | Updated on Nov 15 2019 3:21 AM

KCR Review Over TSRTC Strike Again - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టులో కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రూట్ల ప్రైవేటీకరణ గురించి విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించిన అంశాలను సీఎం కేసీఆర్‌కు అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు వివరించారు. ఈ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో ఆ రోజు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఎస్‌ జోషి, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ సోమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

నేడు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ 
టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ తెలంగాణ భవన్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement